శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం-విపత్తు నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.అలాగే మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, మునిగిపోయిన కాజ్వేలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

