NATIONALPOLITICS

బంగ్లాదేశ్ తరహాలో దేశంలో ఆరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తొంది–రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ దేశ యువతను పావులుగా వాడుకుంటొంది..

బంగ్లాదేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న ప్రతిపక్షాలు..

1984లో జరిగిన అల్లర్లకు కూడా కాంగ్రెస్ పార్టీనే..

అమరావతి: బంగ్లాదేశ్ తరహాలో దేశంలో ఆరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తొందని, ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం గురించి బహిరంగంగా చర్చిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.శుక్రవారం యూపీలోని లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. (SIR)-  రద్దు చేయాలంటూ(CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ఇండియా బ్లాక్ పార్టీలు చేస్తున్న ఆందోళన వెనుక ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసి, దేశాన్ని తగులబెట్టేలా ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

స్వార్ద రాజకీయాల కోసం దేశ యువతను పావులుగా:- బంగ్లాదేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న ప్రతిపక్షాలు అక్కడిలాగా ఇండియాలో కూడా ప్రభుత్వాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్లు మీడియా సమావేశాల్లో బహిరంగంగానే చెబుతూ, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు.వీళ్ల స్వార్ద రాజకీయాల కోసం దేశ యువతను పావులుగా వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, దేశ అభివృద్ధి పథాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యం ఎవరికీ అనుమతి ఇవ్వదు అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ఆయన మద్దతుదారులు గుర్తుంచుకోవాలని అన్నారు.

1984లో జరిగిన అల్లర్లకు కూడా కాంగ్రెస్ పార్టీనే:- శాంతి భద్రతల్ని కాపాడాలంటే చట్టాన్ని గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు బలికాకూడదన్నారు.1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలో క్షమించరాని నేరం చేసిందని,, ఆటు తరువాత 1984లో జరిగిన అల్లర్లకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణం అన్నారు. 1990లో కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రామ భక్తులు,, కరసేవకుల రక్తాన్ని చిందించారు’’ అని రక్షణ మంత్రి అన్నారు.

 

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *