AP&TGPOLITICS

ప్రస్తుతం అవకాశాలు దక్కించుకోలేని వారికి ఇతర పదవుల్లో న్యాయం చేస్తాం-కూటమి నేతలు

B-ఫారాలు పొందిన అభ్యర్థులను..

ఇతర పదవుల్లో న్యాయం చేస్తాం..

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ దాఖలు వ్యవహరంలో, కూటమి అభ్యర్దుల మధ్య మనస్పర్ధలు వస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,పవన్ కల్యాణ్, వీవీఎన్ మాధవ్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ద్వారా కూటమి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం సీ.ఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అగ్రనేతలు కూటమి శ్రేణులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ ద్వారా కూటమి నేతలకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు.

B-ఫారాలు పొందిన అభ్యర్థులను:- కూటమి పార్టీల అధికారిక అభ్యర్థులను గెలిపించాలని,చంద్రబాబు, పవన్, మాధవ్ లు కార్యకర్తలకు సూచించారు. కూటమి పార్టీల B-ఫారాలు పొందిన అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల లీడర్లు, కేడర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ధర్మాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు పార్టీల నుంచి B -ఫారాలు ఇవ్వకుండా పోటీకి దిగాలనుకునే వారు వెంటనే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. అధికారికంగా B-ఫారాలు అందిన అభ్యర్థులకు సహకరించాలని దిశానిర్దేశం చేశారు.

ఇతర పదవుల్లో న్యాయం చేస్తాం:- పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కూటమి నాయకత్వాల ఆమోదం లేని అభ్యర్థులు ప్రకటించాలని ఎన్డీఏ పార్టీల అగ్ర నేతలు సూచించారు. కూటమి పార్టీల అధినాయకత్వాల ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అవకాశాలు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ సహా ఇతర పదవుల్లో న్యాయం చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ భరోసా కల్పించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *