రొమ్ము పరీక్షల్లో సరికొత్త సాంకేతిక విప్లవం-మంత్రి సత్యకుమార్
సెన్సార్ల ఆధారిత పరికరంతో కణుతుల గుర్తింపు..
రాష్ట్రానికి రూ.56 కోట్ల విలువైన 750 ఐబ్రెస్ట్ పరికరాలు..
త్వరలో నిర్వహించే ఎన్సీడీ సర్వేలో వినియోగం..
అమరావతి: రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్రంలో సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఆధునిక పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలో non-communicable disease (ఎన్సీడీ) కార్యక్రమం కింద కొత్తగా జరిగే సర్వేలో భాగంగా ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాలతో మహిళలకు రొమ్ము పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల NCD-4.0 సర్వే ముగిసిoది. .దీనికి కొన సాగింపుగా కొత్తగా మళ్ళీ బీపీ, మధుమేహo, ఓరల్, గర్భాశయ, బ్రెస్ట్ స్క్రీనింగ్ జరగబోతుoది .ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో లక్షలాది మంది మహిళలకు ఈ ibreast సాంకేతికతతో బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల్లోనే మహిళల ఇళ్ల వద్ద లేదా విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ఈ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
కణుతుల గుర్తింపు మరింత సులభతరం:- ప్రస్తుతం వైద్య సిబ్బంది చేతులతో రొమ్మును పరిశీలించి, తాకి కణుతులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తున్నారు. ఐబ్రెస్ట్ ఎగ్జామ్ (ఐబీఈ) పరికరాన్ని యూఈ లైఫ్‌సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది చేతితో పట్టుకునే చిన్న పరికరం. ఇందులో డైనమిక్ కో-ప్లానర్ కెపాసిటివ్ సెన్సార్ సాంకేతికతను ఉపయోగిస్తారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. వైర్లెస్ సౌకర్యం కూడా ఉంది. ఈ పరికరాన్ని రొమ్ము పైభాగంలో ఉంచి, అందులోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ సెన్సార్ల ద్వారా కణజాలంలో మార్పులను అంచనా వేస్తారు. పరీక్ష పూర్తయిన వెంటనే ప్రత్యేక మొబైల్లో రంగుల రూపంలో డిజిటల్ ఫలితాలు కనిపిస్తాయి. అసాధారణ మార్పులు ఉన్నట్లు గుర్తించిన మహిళలను తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు పంపిస్తారు.

