CRIMENATIONAL

లోక్నోలోని కొచింగ్ సెంట‌ర్‌లో ఘోర అగ్రిప్ర‌మాదం-14 మంది మృతి

అమరావతి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, లోక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న కొచింగ్ సెంట‌ర్‌లో సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర అగ్రిప్ర‌మాదంలో 14 మందిని మరణించినట్లు సమాచారం. ఈ సంఘ‌ట‌నపై యూపీ డిప్యూటీ సీఎం బ్ర‌జేశ్ పాఠ‌క్, ప్ర‌మాద స్థలాన్ని ప‌రిశీలించి అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారిని చూసి అయన క‌న్నీరు పెట్టుకున్నారు. ల‌క్నో కోచింగ్ సెంట‌ర్ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.మంటల నుంచి తప్పించుకునేందుకు ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్దులు మొదటి అంతస్థు నుంచి క్రిందకు దూకినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి వుంది.

ప్రధాని మోదీ:- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినం సంఘటనలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తు,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరణించిన వారిలో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు PMNRF నుండి రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

ముఖ్యమంత్రి యోగి:- ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *