INTERNATIONALNATIONALOTHERS

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

అమరావతి: దాదాపు 23 నెలల పాటు లేబర్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి అధికారికంగా రాజీనామా ప్రకటించారు. అధికారం చేపట్టిన రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం బ్రిటన్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గత దశాబ్ద కాలంగా యూకేలో సాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఈ పరిణామం అద్దం పడుతోంది. గత 10 సంవత్సరాల్లో 7వ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టే దిశగా యూకే అడుగులు వేస్తోంది. సోమవారం ’10 డౌనింగ్ స్ట్రీట్’ బయట మీడియాతో మాట్లాడుతూ, తాను UK లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు స్టార్మర్ తెలిపారు.

గత కొన్ని వారాలుగా లేబర్ పార్టీలో అంతర్గత అసంతృప్తి తీవ్రస్థాయికి చేరడం, స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు స్టార్మర్ పదవికి ముప్పు తెచ్చిపెట్టాయి. పలువురు సీనియర్ నేతల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, సొంత పార్టీలోనే నాయకత్వ మార్పుపై డిమాండ్లు పెరగడంతో ఆయన చివరకు దిగిరాక తప్పలేదు. పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *