NATIONAL

పార్లమెంట్‌ ద్వారం వద్ద పాలక,ప్రతిపక్షలు పోటాపోటీ నిరసనలు

ప్రశ్నలకు బదులివ్వడానికి అమిత్‌ షా సిద్ధం..
కాంగ్రెస్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జీ..
అమరావతి: రామమందిర విరాళాలపై అమిత్‌ షా చేసిన ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో మంగళవారం కూడా నిరసన చేపట్టారు. మాకు అడ్డంకులు సృష్టిస్తారా అంటూ పాలక పక్ష ఎన్‌డీఏ ఎంపీలు పోటీగా నిరసన చేపట్టారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారాల్లోని ఒకటైన మకర ద్వారం వద్ద ప్రతిపక్ష, పాలక పక్ష ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ప్రశ్నలకు బదులివ్వడానికి అమిత్‌ షా సిద్ధం:- ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై పోలీసుల అణచివేత, రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంటుకు వచ్చి చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడానికి, ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులివ్వడానికి అమిత్‌ షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు చెప్పారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసన కొసాగించారు.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌లో నిరసనలు చేపట్టిన విద్యార్థులపై హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వం లాఠీచార్జీ జరిపించిందని, దీనిపై చర్చించడానికి రాహుల్‌గాంధీ పారిపోతున్నారని, డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆరోపిస్తూ పాలక పక్ష ఎంపీలు ఎదురు నిరసనలు చేపట్టారు.
Ruling and opposition parties stage competing protests at the Parliament entrance.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *