DEVOTIONALNATIONALOTHERS

రాముడిని అవమానించిన ఎంపీ పప్పు యాదవ్ పై హత్యాయత్నం!

పప్పు యాదవ్‌పై ఎందుకు దాడి జరిగింది..?

ఎన్ని FIR​ నమోదు అయిన బెదిరేది లేదు పప్పూయాదవ్..?

రాముడిని అవమానించిన వాడిని లేపేయండి రూ.51 లక్షలు,బాబాలు..?

యు.పికి చెందిన యువకులు..?

విశ్వ హిందూ పరిషత్..

అమరావతి: బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేశ్‌ రంజన్‌ (పప్పూ యాదవ్)పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఎంపీ అనుచరులు వెంటనే నిందితుడిని పట్టుకుని చితకబాదారు.. దీంతో అక్కడంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకున్న ఎంపీ అనుచరులు పోలీసులకు అప్పగించారు.

పప్పు యాదవ్‌పై ఎందుకు దాడి జరిగింది:- రామ మందిర విరాళాల చోరీపై శుక్రవారం పార్లమెంటు ఆవరణలో సాధువు వేషం వేసుకున్న పప్పుయాద్, విరాళాలు సేకరిస్తూన్నట్లుగా నటిస్తుండగా, రాహుల్‌ గాంధీ సహా పలువురు ఎంపీలు హుండీలో కానుకలు వేశారు. సన్యాసి వేషంలో వచ్చిన ఆయన, పార్లమెంట్ పరిసరాల్లో కూర్చొని విరాళాలు సేకరించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అతిథి పాత్రలో కనిపించారు. ఆయన కొంత మొత్తాన్ని హుండీలో కానుకలు సమర్పించారు. ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా తమ వంతుగా విరాళాలు అందించారు. అలా పలువురు ఎంపీలు ఇచ్చిన విరాళాలతో ఆ సన్యాసి ఉడాయిస్తాడు. అది గమనించిన ఎంపీలు ఆయనని పట్టుకొన్ని దేహశుద్ధి చేసినట్లు నటించడంతో స్కిట్‌ ముగుస్తుంది. అలా సన్యాసి పాత్ర పోషించిన ఎంపీ పప్పూయాదవ్‌ హుండీలోని కానుకలను తీసుకొని జేబులో వేసుకోవటంతో ముగుస్తుంది.

ఎన్ని FIR​ నమోదు అయిన బెదిరేది లేదు పప్పూయాదవ్:- రాహుల్ గాంధీ మరి కొంత మంది ఎం.పీలు హుండీలు డబ్బుల వేస్తున్నట్లు ఒక సీన్ క్రియేట్ చేసి, సనాతన ధర్మాన్ని అవమానించారని యు.పీలోని కొంత బాబాలు మండి పడ్డారు.అలాగే ఈ సంఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఎంపీలు పప్పు యాదవ్, అవధేష్ ప్రసాద్‌లపై వారణాసిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని, సనాతన ధర్మాన్ని ప్రతిపక్షాలు అవమానించాయని బీజేపీ ఆరోపిస్తోంది. వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.FIR​ నమోదు కావడంపై స్పందిస్తూ, ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా తాము బెదరబోమని పప్పూయాదవ్ అన్నారు.

రాముడిని అవమానించిన వాడిని లేపేయండి రూ.51 లక్షలు:-  పార్లమెంటు ఆవరణలో జరిగిన ప్రదర్శనలో కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందన్న పప్పూయాదవ్, ఇది తనను హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నమని ఆరోపించారు. అంతేకాకుండా తన తలకి రివార్డు కూడా ప్రకటించారని పేర్కొన్నారు.”కొందరు బాబాలు రోజూ ‘నన్ను చంపండి, నన్ను కాల్చివేయండి. మేము రూ.51 లక్షలు ఇస్తాము’ అని అంటున్నారు. నాపై దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించాము. నన్ను చంపడానికి ఒక కుట్ర జరిగింది, కానీ నేను ప్రాణాలతో బయటపడ్డాను.” అని పప్పూయాదవ్ అన్నారు.

యు.పికి చెందిన యువకులు:- దాడికి యత్నించిన వ్యక్తిని సుమిత్‌(34)గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అతడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో పనిచేస్తున్నాడని, స్వస్థలం బులంద్‌షహర్‌గా తెలిపారు. నిందితుడితో పాటు కారులో బయట వేచి ఉన్న హ్యాపీ అనే మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

విశ్వ హిందూ పరిషత్:- పార్లమెంట్ ప్రాంగణంలో చేపట్టిన నిరసన ద్వారా రాహుల్​ గాంధీ, పప్పూ యాదవ్‌లు సనాతన ధర్మాన్ని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఈ నిరసన లక్షలాది మంది రామ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతిపక్ష చర్య మాత్రమే కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరం అని తెలిపారు. “రాహుల్ గాంధీ సహా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యావత్ దేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *