MOVIESNATIONALOTHERS

“ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే, రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు.”- నానా పటేకర్

పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా..

పద్మశ్రీ పురస్కారం..

నానా,ముద్రను ఎప్పటికీ గుర్తుచేస్తూనే..

అమరావతి: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు విశ్వనాథ్ పటేకర్ (నానా పటేకర్-75) కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కన్పించడంతో, వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారు. ఉదయం 4-20 గంటల ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా అయన మరణించినట్లు మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.

గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు తనకు ఆరోగ్యం బాగాలేదంటూ పటేకర్, స్నేహితుడికి మెసేజ్ చేశారు. ఉదయం 4 గంటల సమయంలో ఆ మెసేజ్ చూసిన స్నేహితుడు హుటాహుటిన డోనా పౌలాలోని పటేకర్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే పటేకర్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో, కేర్‌టేకర్ వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి పరుగెత్తి అంబులెన్స్ తీసుకొచ్చారు. ఆసుపత్రికి కేవలం 5 నిమిషాల దూరంలోనే ఆయన నివాసం ఉండగా, అంబులెన్స్‌ లోనే వైద్యులు సీపీఆర్​ ప్రారంభించినప్పటికి ఫలితం లేక పోయింది.

పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా:- నానా పటేకర్ ఆకస్మిక మరణవార్త బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 1951 జనవరి 1వ తేదీన మహారాష్ట్రంలోని మురుడ్‌లో నానా పటేకర్ జన్మించారు. ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ లో విద్యాభ్యాసం చేశారు. నటనపై ఆసక్తితో రంగస్థలంపై తన ప్రయాణాన్ని ఆరంభించారు.  1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సాధారణ పాత్రల నుంచి ప్రతినాయకుడి వరకు, భావోద్వేగభరితమైన పాత్రల నుంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ల వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడిగా నానా పటేకర్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది.

పద్మశ్రీ పురస్కారం:- క్రాంతివీర్’లో ఆయన పోషించిన పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది.‘పరిందా’, ‘అగ్ని సాక్షి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు జాతీయ అవార్డులు కూడా దక్కాయి.2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.నానా పటేకర్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాలతో పాటు రంగస్థల అనుభవం కూడా ఆయన నటనకు బలమైన పునాదిగా నిలిచింది. పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడిగా నానా పటేకర్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది. ఆయన నటించిన పాత్రలు, డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన నటనా శైలి భారతీయ సినిమాపై ఆయన వేసిన ముద్రను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.

తన అకాల మరణానికి కేవలం మూడు రోజుల ముందు, గోవాలో జరిగిన ఒక సామాజిక కార్యక్రమంలో నానా పటేకర్ ప్రజల ముందు నిలబడి, తనదైన శైలిలో ఇలా అన్నారు. “ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే, రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు.”

అక్టోబర్ 4న గోవాలోని పనాజీ సమీపంలో ఉన్న డోనా పౌలాలో జరిగిన ‘సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ కార్యక్రమంలో పటేకర్ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన తన స్నేహితుడు, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్‌ను కూడా స్మరించుకున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *