AP&TGPOLITICS

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు-సుప్రీంకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న వైసీపీ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన సమయం ప్రకారం ఆరు వారాల్లోపు నోటిఫికేషన్ కు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు ‘సర్’ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలని, లేకపోతే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

శనివారం కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనుంది. బీసీ రిజర్వేషన్లపై జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌పై చర్చించేందుకు కేబినెట్ సమావేశం కానున్నది. కమిషన్ నివేదికను మంత్రివర్గం పరిగణలోకి తీసుకుని, బీసీలకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్స్ చేసిన రిజర్వేషన్లు, జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించనున్నట్లు సమాచారం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *