AP&TGOTHERSSPORTS

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో పోటీల్లో14 వేల మంది క్రీడాకారులు,కోచ్‌లు,సిబ్బంది- శాప్ చైర్మన్

జెర్సీలు ఆవిష్కరణ..

ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభోత్సం..

మంత్రులు క్రీడాకారులతో కలిసి..

అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్తాయికి సంభందించిన 26 జిల్లాల జెర్సీలను అదివారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్ లో అమరావతి ఛాంపియన్షిప్-2026 రాష్ట్రస్థాయికి సంబంధించి తిరుపతి జెసీ గోవింద రావు, పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉమా,ఎస్ వి యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడుతో కలిసి 26 జిల్లాలకు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ   మట్టిలో మాణిక్యాలు గుర్తించడమే ఈ అమరావతి ఛాంపియన్షిప్ -2026 యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు 9, 911 మంది:- రెండు నెలల పాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్‌లో నియోజకవర్గ స్థాయిలో 2,07, 498 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. జిల్లా స్థాయిలో 83,650 మంది క్రీడాకారులు పోటీపడ్డారని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో 9, 911 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, వారు 12 క్రీడాంశాల్లో పోటీపడనున్నారని వివరించారు.

మంత్రులు క్రీడాకారులతో కలిసి:- ఆగష్టు 24న ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమములో హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రవాణా-క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ప్రభుత్వ విప్ లు,  ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కలెక్టర్‌, ఎస్పీ, జేసీ, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ కమిషనర్‌ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో తదితర క్రీడల్లో పాల్గొననున్నారని వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *