ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు
అమరావతి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు..సభా వేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు..ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది..దీంతో ఆయన స్టేజిపై కింద కుర్చున్నాడు..భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా ఏర్పడి,,వేదిక పైనుంచి దించి ఆసుపత్రికి తరలించారు.. అనంతరం స్టేజీ పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు.. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చారు..ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు..దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు..ఈ సంఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది..
డొనాల్డ్ ట్రంప్:- అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.. దుండగులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తన కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిందని చెప్పారు.. కాల్పుల శబ్దం వినగానే ఏదో తేడాగా ఉందని అర్ధమైందన్నారు..దీంతో తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు..కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు..అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు..గాడ్ బ్లెస్ అమెరికా అంటూ తనపై జరిగిన కాల్పుల సంఘటన గురించి ట్రూత్ సోషల్ సైట్‌లో వెల్లడించారు.