NATIONAL

భారత దేశ ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం-ప్రధాని నరేంద్రమోదీ

78వ స్వాతంత్య్ర దినోత్సవం పండుగ..
అమరావతి: భారత దేశ ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని,, దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు..గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.. దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం ప్రధాని మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు..దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని,,ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందననారు..శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిన భారతదేశం,,స్వేచ్చవాయువుల కోసం నాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని,, ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందన్నారు..
వికసిత భారత్‌ మన లక్ష్యం:- 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని ప్రధాని తెలిపారు.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని,,తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ని తీర్చిదిద్దాలన్నారు.. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని,,దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు.. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడిన ప్రధాని,, అంతరిక్షంలో భారత స్పేస్‌స్టేషన్‌ త్వరలో సాకారం కావాలన్న అకాంక్షను వ్యక్త చేశారు..అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకువస్తున్నామని,,నేషన్‌ ఫస్ట్‌… రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు..
సీ.ఎం చంద్రబాబు:- దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలివుండాలని కలలు కన్నామని,,ఇందు కోసం 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు..అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, 1956 నవంబర్‌ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:- రాష్ట్రంలో ఆడపిల్లలు, సగటు ప్రజల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని,, ఇదే విషయం కలెక్టర్, ఎస్పీల సదస్సులోనూ స్పష్టం చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు..గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు..అనంతరం పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు..ఈ సందర్బంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయన్నారు.. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు.. అందుకే శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *