మాజీ CID DG పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్
అమరావతి: మాజీ CID DG పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు..ప్రస్తుతం CID DG డీజీగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు అనుమతి లేకుండా వివిధ సార్లు అమెరికా,,జార్జియా,,స్వీడన్,,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,, యూకే తదితర దేశాలకు వెళ్లడంపైన సునీల్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి.. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయన్ని సస్పెండ్ చేశారు.. విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లానింగ్‌కు విరుద్ధంగా విదేశాల్లో ఉండడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి..దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది..ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణకావడంతో సునీల్ కుమార్‌ను సస్పెండ్ వేటు వేసింది.