ఎమ్మేల్యే కోటా ఎమ్మేల్సీ స్థానాలకు విడుదలైన నోటిఫికేషన్
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ-5,,అంధ్రప్రదేశ్-5) MLA కోట MLC స్థానాలకు సోమవారం సాధారణ పరిపాలనా శాఖ CEO వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు..నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది..ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది..మార్చి 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు,,11వ తేదిన నామినేషన్ల పరిశీలన,, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు..మార్చి 20వ తేదిన పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు..తెలంగాణ నుంచి మొహమ్మద్ అలీ,,సత్యవతి రాథోడ్,,సిరి సుభాష్ రెడ్డి,,మల్లేశం యాగీ,,మీర్జా రియాజ్ అల్ హసలు,, అంధ్రప్రదేశ్ నుంచి జంగాకృష్ణమూర్తి,,దువ్వారపు రామారావు,, బీటీ నాయుడు,,అశోక్ బాబు,, యనమల రామకృష్ణుడుల పదవి కాలం మార్చి 29వ తేదితో ముగియనుంది..ఖాళీ 5 స్థానాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు,,ఎన్నికల పొత్తుల్లో బాగంగా పిఠాపురం సీటును వదులుకున్నటీడీపీ అభ్యర్ది వర్మకు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తున్నట్లుగా వినికిడి..ఇక మిగిలిన మూడు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తొంది..ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎమ్మేల్యేల సంఖ్యాబలం లేని కారణంగా ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు లేవు.