NATIONAL

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన కేంద్రం

అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3,,డీజిల్‌పై పూర్తిగా (జీరో) చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఇప్పటివరకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి దాదాపు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాన్ని తగ్గించుకోవడానికి వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరకపోయినప్పటికీ, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ నిర్ణయం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *