నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడి.
ఈ నెల 26న కేరళంను..? మరి రోహిణి కార్తీ వుందిగా??
అమరావతి: భారత వాతావరణశాఖ వేసవికి వీడ్కోలు పలికే శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంతో పాటు మొత్తం నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ధృవీకరించింది.మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది ఐఎండి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది.
మరి రోహిణి కార్తీ:- మే 25వ తేదిన రోహిణ ప్రవేశించిన 13 రోజుల తరువాత జూన్ 8వ తేదిన మృగశిర కార్తీ పెట్టిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంటుందంటారు. మరి నైరుతి ప్రవేశించిన అప్పటి వరకు మనకు వేసవి శెగ తప్పక పోవచ్చు.

