మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహణ-చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈ నెల 27, 28న రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించిన చంద్రబాబు నాయుడు అదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్టీఆర్ భవన్‌లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

