ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్
అమరావతి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా,, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి..సోమవారం వేకువారుజామున ఎన్‌కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఎన్‌కౌంటర్‌పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు..పంజాబ్‌లో ISIS వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఫలితాలు సాధిస్తున్నమని తెలిపారు.. పాకిస్తాన్ స్పాన్సర్డ్ “ఖలిస్థాన్ జిందాబాద్” ఫోర్స్ ఉగ్రవాద బృందాల ఏరివేత కోసం యూపీ,,పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని వెల్లడించారు..ఈ క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరపడం వల్ల ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు..మరణించిన ఉగ్రవాదులు ముగ్గురు ఇటీవల పంజాబ్‌లోని ఓ పోలీస్ పోస్ట్ పై దాడికి పాల్పడినట్టు తెలిపారు.. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఖలిస్థానీ ఉగ్రవాదులను పంజాబ్ గురుదాస్‌పుర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25),, వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23),, జస్ప్రీత్ సింగ్ అలియాస్ పర్తాప్ సింగ్ (18) గా పోలీసులు గుర్తించారు.. పారిపోవడానికి వీరు ఉపయోగించిన ద్విచక్రవాహనం చోరీ చేసిందని తెలిపారు.