విద్యుత్ బస్సులు కొనుగోలు,నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు-ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో 10 వేల డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాల్సి ఉందని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు.శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సు కొనలంటే దాదాపు రూ.1.70 కోటి ఖర్చు అవుతుందన్నారు.ప్రస్తుతం APSRTCలో అంత మొత్తం నిధులు లేవన్నారు. పదివేల విద్యుత్ బస్సులు కొనాలంటే 17 వేల కోట్లు కావాల్సి వుంటుంది కాబట్టి విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే మేలు అన్నారు. ఇదే సమయంలో స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ పై ఆర్ధిక భారం పెరిగిందన్నారు. 1050 ఎలక్ట్రికల్ బస్సులకు ప్రపోజల్స్ పెట్టడం జరిగిందని,750 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. రెండు మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయని తెలిపారు.ప్రతీ రోజు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్ కు వెళుతుంటాయని,వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయన్నారు.

