బెంగళూరు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సల్మాన్ రెహమాన్ ఖాన్ రువాండాలో అరెస్ట్
అమరావతి: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సల్మాన్ రెహమాన్ ఖాన్‌ను ఇంటర్‌పోల్ వర్గాల ద్వారా రువాండా నుంచి భారత్‌కు NIA అధికారులు తీసుకొని వచ్చారు..ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ను రువాండా నుంచి భారత్‌కు తీసుకుని రావడానికి CBI,NIA అధికారులు, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో-కిగాలీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆపరేషన్ నిర్వహించింది.
NIA, అతనిపై నేరపూరిత కుట్ర, ఉగ్రవాద సంస్థకు సహాయం అందించడంతోపాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల చట్టానికి సంబంధించిన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించింది..అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో సభ్యుడిగా ఉంటూ బెంగళూరు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డట్టు పేర్కొంది.. అలాగే భారతదేశంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు అందించడంలో సహాయపడినట్లు, బెంగళూరు నగరంలోని హెబ్బాల్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది..
NIA అభ్యర్థన మేరకు CBI,, సల్మాన్ రెహమాన్ ఖాన్‌పై ఇంటర్‌పోల్ ద్వారా ఆగష్టు 2వ తేదిన రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది..ఇతన్ని పట్టుకోవడానికి ప్రపంచంలోని అన్ని ఇంటీలీజెన్స్ సంస్థలకు వివరాలు పంపారు.. ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో – కిగాలీ సహాయంతో, ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్, రువాండాలో ఉన్నట్లు గుర్తించారు..NIA భద్రతా బృందం నవంబర్ 27తేదిన అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది.