ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి: క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈసారి 17 మందికి అవార్డులు అందించనుంది.1962 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ. అరుమాయినాయగానికి జీవిత సాఫల్య అవార్డు దక్కింది.అలాగే 2025లో ప్రదర్శనలకు కాను పలువురికి అర్జున అవార్డులు ప్రకటించారు.
అర్జున అవార్డు గ్రహీతలు:- అథ్లెటిక్స్:– తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి..బ్యాడ్మింటన్:– ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్..బాక్సింగ్:– నరేందర్ బెర్వాల్..చెస్:– విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్..పారా షూటింగ్:– ధనుష్ శ్రీకాంత్..హాకీ:– లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్..కబడ్డీ:– సుర్జీత్, పూజ..పారా-షూటింగ్:– రుద్రాంశ్ ఖండేల్వాల్..పారా-అథ్లెటిక్స్:– ఏక్తా భ్యాన్..రోయింగ్:– అరవింద్ సింగ్..షూటింగ్:–అఖిల్ షియోరాన్.
లైఫ్‌టైమ్ అర్జున అవార్డు:- 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ.అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) దక్కింది.
ద్రోణాచార్య అవార్డులు:- ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్‌కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌కు ప్రకటించారు.

