CRIMENATIONAL

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో లింకులు-ఏడుగురు అరెస్ట్

పుల్వామా ప్రాంతంలో…  

ఉగ్రముఠాలోని వ్యక్తుల వివరాలు:-

అమరావతి: పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ అండతో భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాలోని ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ వాసులుగా గుర్తించారు.

పుల్వామా ప్రాంతాన్ని సందర్శించినట్లు:- ఘజియాబాద్‌లో అరెస్ట్ అయిన ఆరుగురిలో నలుగురు గతంలో పుల్వామా ప్రాంతాన్ని పరిశీలించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామా తరహాలో మరో పెద్ద దాడికి పాక్ ప్లాన్ చేస్తోందనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ముఠా ఢిల్లీ నుంచి జమ్మూ వరకు గల ప్రముఖ రైల్వే స్టేషన్ల వద్ద సోలార్‌ సంబంధిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి భారత సైనికుల కదలికలను గుర్తించేందుకు యత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే వీరు ఢిల్లీలోని కాంట్, హరియాణాలోని సోనిపట్ రైల్వే స్టేషన్ల వద్ద అలాంటి కెమెరాలను అమర్చినట్టు గుర్తించారు.

గతంలోనే యాక్టివేట్ చేసిన సిమ్‌లను:- ఈ దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. భారతీయ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలను విదేశీయులకు పంపిస్తూ వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డుల చోరీ, గతంలోనే యాక్టివేట్ చేసిన సిమ్‌లను కొనుగోలు చేయడం వంటివి వినియోగించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలనూ తమ సొంత అకౌంట్ల ద్వారా కాకుండా జనసేవా కేంద్రాలు, స్థానిక దుకాణాల ద్వారా నగదు రూపంలో స్వీకరించి పోలీసుల కళ్లుగప్పేందుకు యత్నించినట్టు అధికారులు తేల్చారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపైనా విచారణ కొనసాగుతోందని, దేశ భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి నెట్‌వర్క్‌ లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఉగ్రముఠాలోని వ్యక్తుల వివరాలు:-

1-ఘజియాబాద్‌లోని లోని ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అనస్ అలియాస్ అనస్ త్యాగిపై గతంలో మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతను నవంబర్ 2025 నుండి పాకిస్థాన్‌లోని అజ్మల్ గుజ్జర్ మరియు షహజాద్ భట్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వచ్చాడు.

2-ఘజియాబాద్‌లోని లోనీకి చెందిన 26 ఏళ్ల మోహిత్ అలియాస్ యోగి కూడా ఇతనిలో ఒకడు. ఇతను అజ్మల్ గుజ్జర్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు.

3-ఘజియాబాద్‌లోని టెక్నో సిటీ నివాసి అయిన దీపక్ అలియాస్ దీపక్ అగ్రోలాపై గతంలో 23 కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్య, దోపిడీ, హత్యాయత్నం-గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద నమోదైన అభియోగాలు ఉన్నాయి.

4-టెక్నో సిటీ నివాసి అయిన జతన్. అతను హత్యాయత్నానికి సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నాడు.

5-ఘజియాబాద్, లోనీ నివాసి అయిన ఆరిఫ్ అలియాస్ ప్రధాన్. ఇతనిపై ఆర్మ్స్ యాక్ట్ మరియు ఎన్‌డిపిఎస్ (NDPS) యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.

6-మరో వ్యక్తి సాబీర్ నివాసం వుంటున్నారు.

7-పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన కరణ్‌వీర్ సింగ్. ఇతనిపై NDPS చట్టం కింద కేసు నమోదై ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *