నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసింది బంగ్లాదేశ్‌కు చెందిన “షరీఫుల్ ఇస్లాం”
అమరావతి: బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబయి పోలీసులు శనివారం అర్ధరాత్రి పోలీసులు థానేలో అరెస్టు చేశారు..ప్రస్తుతం అతడిని పోలీసు కస్టడీ కోసం జడ్జీ ఎదుట హాజరుపరిచారు.. నిందితుడు ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడని, దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడినట్లు డీసీపీ దీక్షిత్ చెప్పారు.. ఆదివారం డీసీపీ నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు..”జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు అలీ ఖాన్ పై దాడి జరిగింది.. మేమ FIR నమోదు చేసి 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించాం..
దుండగుడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో తేలింది..భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఇతడు 6 నెలలుగా ముంబయిలోనే నివసిస్తున్నాడు.. విజయ్ దాస్ అనే పేరుతో ఒకహౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసే ఇతడి అసలు పేరు “షరీఫుల్ ఇస్లాం” “బిజయ్ దాస్”, “మహ్మద్ ఇలియాస్” ఇలా రకరకాల తప్పుడు పేర్లతో సంచరిస్తున్నాడు..దొంగతనం కోసం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన షరీఫుల్ ఇస్లాం, ముందుగా సైఫ్ చిన్న కొడుకు 4 ఏళ్ల జేహ్ గదిలోకి ప్రవేశించాడు..బ్లేడ్ పట్టుకుని గదిలోకి వచ్చిన ఆగంతకుని చూసి బాలుడి సర్వెవెంట్ ఇలియమ్మ ఫిలిప్ గట్టిగా కేకలు వేయడం వల్ల సైఫ్ అక్కడికొచ్చాడు..నిందితుడి దాడిలో సైఫ్‌తో పాటు అమె కూడా గాయపడింది..దాడి చేసే ముందు నిందితుడు తనను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆయా ఇలియమ్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
“షరీఫుల్ ఇస్లాం” కంటే ముందు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.. ఒకరిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..అతడిని కూడా విచారించి విడుదల చేశారు.. అంతకుముందు కూడా ఒక అనుమానితుడిని అరెస్టు చేసి బాంద్రా పోలీసు స్టేషన్‌లో విచారించి నిందితుడు కాదని నిర్ధరించి విడుదల చేశారు.