కర్ణాటకకు చెందిన చిత్ర పెళ్లి కూతురుగా కండలను ఫోజులు ఇస్తూ ఫోటో షూట్
అమరావతి: పెళ్లి కూతురుగా ముస్తాబు అయ్యే అమ్మాయిలు ఎంతో నాజుకుగా,,ముట్టకుంటే కందిపోయేలా సిగ్గుపడుతూ పెళ్లికూతురు కనపడుతుంది..చిత్ర అనే అమ్మాయి పెళ్లి కూతూరుగా తనదై ముద్ర వేసింది అని చెప్పాలి..వివారల్లోకి వెళ్లితే…..కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం, ఫిట్‌నెస్ ట్రైనర్ & బాడీబిల్డర్.. సాంప్రదాయ కంజివరం చీరలో ఆమె పెళ్లికూతురిగా ముస్తాబైంది.. నగలు పెట్టుకుని బాడీబిల్డర్‌లా పెళ్లి దుస్తుల్లోనూ తన ఫిట్‌నెస్ ప్రదర్శించింది.. ఎంతో గర్వంగా ఆమె తన అందాన్ని, కండలను ఒకేసారి చూపెడుతుండడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఆమె పెళ్లికూతురిలా తయారై కండలు కూడా ప్రదర్శించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.