తమ ప్రభుత్వం పేదలకు ఉత్తుత్తి హామీలు ఇవ్వదు-ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం..
అమరావతి: రాష్ట్రపతి ప్రసంగం “వికసిత్ భారత్” లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని,,తమలో ఆత్మవిశ్వాసం నింపిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..మంగళవారం పార్లమెంటు బడ్జె్ట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిస్తూ,, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి పధ్నాలుగు సార్లు సమాధానం ఇచ్చే అదృష్ట్యాన్ని దేశ ప్రజలు తనకు ఇచ్చారని, ఇందుకు తాను దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని అన్నారు..20వ శతాబ్దంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత,, 21వ శతాబ్దంలో 25 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ది జరిగిందనేది కాలమే తెలియచేస్తుందన్నారు..రాష్ట్రపతి ప్రసంగాన్ని శ్రద్దగా అలకిస్తే, రాబోయే 25 సంవత్సరాల్లో వికసిత్ భారత్ దిశగా దేశ ప్రజల్లో విశ్వాసం నింపే దిశగా పనిచేస్తున్నాం అని అన్నారు..
కాంగ్రెస్ “గరీబీ హటోవా” నినాదంపై మాట్లాడుతూ,,తమ ప్రభుత్వం పేదలలకు ఉత్తుత్తి హామీలు ఇవ్వదని,, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు..పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి సవాళ్లను అవగాహన చేసుకుని,,వాటిని అధిగమించేలా ప్రణాళికలకు కట్టుబడి ఉంటామని చెప్పారు..ఇప్పటి వరకూ పేదలుకు 4 లక్షల గృహాలు అందచేశామన్నారు.. గతంలో మహిళలు బహిర్భూమి వెళ్లె వెసులుబాటు లేక అవస్థలు పడవారని,, అలాంటి వారి కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామన్నారు.. ఎవరికైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయో, వారికి ఇలాంటి సమస్యలు అర్థం కావని పరోక్షంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చురకలు వేశారు..గత 10 ఏళ్లలో 25 లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు..ప్రభుత్వాలు అంకితభావంతో పథకాలు అమలు చేసినప్పుడే ఇలాంటి మార్పు సంభవమని అన్నారు..
రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్ష విమర్శలు సంధిస్తూ,, రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ,,పేదల గుడిసెల్లో ఫోటోల కోసం సరదాగా గడిపేవారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతూ చేసే ప్రసంగాలు బోర్‌గానే ఉంటాయన్నారు..కొందరు నాయకులు విలాసవంతమైన బాత్ షవర్లు కోరుకుంటారని,, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడంపై దృష్టిసారిస్తుందని కేజ్రీవాల్ విలాసవంతమైన శీష్ మహల్ (అద్దాల మేడ)పై పరోక్ష విమర్శలు చేశారు..ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామలకు 16 పైసలే చేరుతోందని గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వాపోయారని,, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అప్పట్లో అదే పరిస్థితి ఉండేదన్నారు..అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందని,, ఇందుకు తమ ప్రభుత్వం ప్రవేశం పెట్టిన నగదు బదిలీతో నేరుగా ప్రజలకే సొమ్ము అందుతోందని వెల్లడించారు.