అన్నామలై బీజెపీలో కొనసాగుతారా లేక రాజీనమా చేస్తారా?
అమరావతి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నాయి. మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు ఉహగానలు విన్పిస్తున్నాయి. మంగళవారం బీజెపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో అన్నామలై సమావేశం అయ్యారు.అనంతరం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం తమిళనాడు బీజేపీలో చర్చనీయాంశంగా మారగా, అన్నామలై భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.అయతే ఒకవేళ ఆయన నిజంగానే రాజీనామా సమర్పించి ఉంటే, అమిత్ షాతో ఆయన సమావేశం తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా తెలిసి వుండేది. అయితే, ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ ఏదీ లేదు,” అని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు తెలిపారు.
జూన్ 4వ తేది పుట్టిన రోజున:- ఒక వేళ అన్నామలై బీజెపీని వీడి తన పుట్టిన రోజున (జూన్ 4న) ‘మక్కల్ శక్తి అయ్యక్కం’ పేరిట కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు తమిళనాడులో ఊహాగానాల మొదలైనాయి.ఇదే విషయంపై అన్నామలైను చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రశ్నించగా, రెండు రోజుల్లో తన వైఖరిని స్పష్టం చేస్తానని సమాధానమిచ్చారు. దీంతో అన్నామలై విజయ్‌లా కొత్త పార్టీ పెడతారా? లేదంటే బీజేపీలోనే కొనసాగుతారా? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

