ఏపీలో పలు జిల్లాలకి రెడ్ అలెర్ట్
అమరావతి: అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందని విపత్తుల నిర్వహణ సంస్థ తలిపింది. విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం (03-06-2026) రాష్ట్రంలో క్రింది విధంగా వాతావరణం ఉండనుంది. తేలికపాటి వర్షాలు:శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప.
జూన్ 4వ తేదీ నాటిని కేరళను తాకే అవకాశాలు:- నైరుతీ రుతుపవనాలు జూన్ 4వ తేదీ నాటిని కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి కేరళను తాకుతుంది. దీంతో వర్షాకాలం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం మబ్బుల రాక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 4వ తేదీ నాటికి కేరళ, తమిళనాడు, అరేబియా సముద్రం, లక్షద్వీప్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు నైరుతి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.

