బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ముందస్తు ఉచిత పరీక్షలు చేస్తోంది-మంత్రి
తిరుపతి: బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ ముందస్తు ఉచిత పరీక్షలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.మంగళవారం తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాల్ని ఏర్పాటు చేశామన్నారు..155 మంది సూపర్ స్పెషలిస్టులు, 238 మంది స్పెషలిస్టులు, 4వేల మంది ANMలు, 4 వేల మంది వైద్యాధికారులు,18వేల మంది PHC సిబ్బందితో బృందాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు..గ్రామాల్లోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాల్లో ఉచితంగా క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు..ఇప్పటి వరకు 71 లక్షల మందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా 66 వేల మంది అనుమానితుల్ని గుర్తించడం జరిగిందన్నారు..అనుమానితుల్ని బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ల(POUs)కు రిఫర్ చేస్తారని చెప్పారు.. POUలలో అనుమానితులకు మరోసారి పరీక్షలు చేసి క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకుంటారని అన్నారు..POUలలో రద్దీ లేకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం, గురువారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారని,,గ్రీన్ ఛానల్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక OP వార్డుల్లో క్యాన్సర్ అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.