అక్రమ వలసదారులపై వెనక్కు పంపించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు-సుప్రీమ్ కోర్టు
అమెరికా అధ్యక్షడు ట్రంప్, అధికారంలోకి వచ్చిన ప్రక్క రోజు నుంచే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిలో సుమారు 18,000 మంది భారతీయులు ఉన్నారని అమెరికన్ ప్రభుత్వ సంస్థలు గుర్తించాయి.. వారందరినీ డిటెన్షన్ సెంటర్లలో పెట్టిన అమెరికా, 205 మందిని మిలటరీ విమానం సీ-17లో ఎక్కించి భారత్‌కు వెనక్కి పంపించింది.. టెక్సాస్ నుంచి బయలుదేరిన ఆ విమానం భారత్‌లోని అమృత్‌సర్ చేరుకుంది..
అమరావతి: అక్రమ వలసదారులపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తూ వారివారి దేశాలకు వెనక్కి పంపుతుంటే భారత్‌లో మాత్రం అందుకు పూర్తిభిన్నంగా ప్రభుత్వాలు ఎందుకు వ్యవహరిస్తున్నాయంటూసర్వోన్నతన్యాయస్థానం ప్రశ్నించింది..బంగ్లాదేశం నుంచి అక్రమంగా భారత్‌లో చొరబడి నివసిస్తున్నవారిని వెనక్కి పంపకుండా కాలయాపన చేస్తున్న అస్సాం ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..అక్రమ చొరబాటుదారులుగా గుర్తించినవారిని వెంటనే వెనక్కి పంపకుండా ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా ? అంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది..
బంగ్లాదేశ్‌తో సరిహద్దు వున్న పశ్చిమ బెంగాల్,, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్ల సమస్య చాలా వీపరితంగా ఉంది..ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, సరిహద్దు రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్ట్ర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)ని ఆమలు చేసి అక్రమ చొరబాటుదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది..ఇలా గుర్తించినవారిని, వెనక్కి పంపే క్రమంలో డిటెన్షన్ సెంటర్లలో పెట్టింది.. అలా గుర్తించిన 63 మందిని వెనక్కి పంపకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.. ఒకసారి ఒక వ్యక్తిని అక్రమ చొరబాటుదారుడిగా గుర్తించాక, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్య వెనక్కి పంపించడం.. ఆర్టికల్ 21 ప్రకారం ఎక్కవ కాలం డిటెన్షన్ సెంటర్లో పెట్టడం కుదరదు..అస్సాంలో ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు చాలా ఉన్నాయి కదా వాటి నుంచి ఎంతమందిని వెనక్కి పంపారు? అంటూ జస్టిస్ భుయాన్ ప్రశ్నించారు.. వారి చిరునామ తెలియక పొవడంతో,వారిని వెనక్కు పంపడంలో ఆలస్యం జరుగుతొందని ఆస్సాం చీప్ సెక్రటరీ కోటా.రవి ఇచ్చిన సమాధానపై జస్టిస్ ఓకా స్పందిస్తూ, అక్రమ చొరబాటుదారులు ఏ దేశం నుంచో వచ్చారో తెలిసినా,, వారి చిరునామాలు తెలియక వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచామన్న సమాధానాన్ని తప్పుబడుతూ,, వారిని ఆయా దేశాల రాజధానులకు పంపించండి అంటూ సూచించారు.. అడ్రస్ తెలియదు అన్న కారణం చూపుతూ ఎంత కాలం డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారంటూ జస్టిస్ ప్రశ్నించారు..వారి దేశం ఏదో మీకు తెలుసు కదా వారి చిరునామా తెలిసే వరకు మీరు ఎలా ఎదురు చూస్తుంటారు ? వారు ఎక్కడికి వెళ్లాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది.వారి దేశ రాజధానులకు వారిని పంపించండి అంటూ వ్యాఖ్యానించారు.. వారిని వెనక్కి పంపే విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం కోరుతూ ప్రతిపాదనను ఎందుకు సమర్పించలేదని అస్సాం ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.