NATIONALOTHERSWORLD

భారీ వాణిజ్య ఒప్పందాలను భారత్‌-అమెరికా కుదుర్చుకోనున్నాయి-ట్రంప్‌

ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు-ప్రధాని మోదీ
అమరావతి: భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగుపడింది..2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి..శుక్రవారం సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాధినేతలు మాట్లాడారు..సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్‌-అమెరికా కుదుర్చుకోనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు..ఐదోతరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు F-35లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా సిద్దంగా వున్నట్లు ట్రంప్ తెలిపారు..అలాగే బిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్‌కు అమెరికా విక్రయించనున్నదని వెల్లడించారు..2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్‌ రాణాను అప్పగించేందుకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌,, అమెరికా మునుపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు..ప్రధాని మోదీనే తనకంటే దేశం కోసం చాలా మెరుగ్గా బేరసారాలు ఆడగలరని, అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్‌ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ:- మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లుతూ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం,, అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు.. ఇంధనం,,న్యూక్లీయర్ కీలక సాంకేతికతలు,, కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని భారత్‌-అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు..అక్రమ వలసదారుల అంశంపై వ్యాఖ్యనిస్తూ, చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు.. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని,, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.. డబ్బు, ఉద్యోగాలు ఆశజూపి కొంతమంది యువత, పేదరికంలో ఉన్నవారిని మోసం చేస్తున్నారన్నారు.. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని,, వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారని ప్రధాని మోదీ అన్నారు..అలాంటి వాటిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.. ఈ ప్రయత్నాల్లో భారతదేశం అమెరికాకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *