24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల
అమరావతి: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జూన్ 18వ తేదిన పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ కాగా జూన్ 9న నామినేషన్ల పరిశీల ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు జూన్ 11 వరకు గడువిచ్చారు. జూన్ 18వ తేదిన పోలింగ్ అనంతరం, అదే రోజు ఓట్లు లెక్కిస్తారు. జూన్ 20న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. రాష్టం నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిద్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ ల పదవీ కాలం జూన్ 26 తేదిన ముగియనుంది.

