రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్-కేంద్ర మంత్రి సోనోవాల్
అమరావతి: రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును కానుకగా ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్-జలమార్గాల శాఖ మంత్రి మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం వస్తుందని మంత్రి వెల్లడించారు.దుగరాజపట్నం వద్ద ఈ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుసొంది.తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 3,488 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనుంది.ఈ క్లస్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. నౌకల తయారీతో పాటు భారీ స్థాయిలో షిప్ రిపేర్, మెయింటెనెన్స్ సదుపాయాలు కూడా ఇందులో ఏర్పాటు కానున్నాయి.

