పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం
అమరావతి: పుల్వామా ఉగ్రదాడిలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-బదర్ కమాండర్ హమ్జా బుర్హాన్‌ను, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు వస్తున్నాయి.2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో CRPF కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో:- పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గుర్తుతెలియని దుండగులు జరిపిన దాడిలో ఉగ్రవాది అయిన హమ్జా బుర్హాన్ హతం అయ్యాడు. పుల్వామా ఉగ్రదాడి కుట్రకు సంబంధించి హమ్జా బుర్హాన్ పేరును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జిషీట్లో చేర్చారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడిలో అతని ప్రమేయం ఉందని, స్థానిక నెట్వర్క్ ల ద్వారా జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులను సమన్వయం చేస్తూ సరిహద్దుకు ఆవల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని నివేదికలు తెలిపాయి.

