NATIONALPOLITICS

కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను అందచేసిన సీ.ఎం సిద్ధరామయ్య

అమరావతి: కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం అందచేశారు. అనంతరం మంత్రులు డీకే శివకుమార్‌ పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం సూచనలతో తాను సీఎం పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైదొలిగానని చెప్పారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, దాన్ని గవర్నర్‌ ఆమోదిస్తారనే విశ్వాసం ఉందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

నేటి సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నాని సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి ఆ సమావేశ:లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తొంది. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారు అయింది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *