ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌పై దాడులు చేసిన అమెరికా
అమరావతి: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలు జరుగుతూనే ఉన్న సమయంలో అమెరికా దళాలు బుధవారం ఇరానీ మిలిటరీ కేంద్రంపై దాడులు చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు పేర్కొన్నారు. బందర్ అబ్బాస్‌లో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అమెరికా దళాలు పేల్చేశాయి.IRGC డ్రోన్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సదరు కంట్రోల్ స్టేషన్‌ను పేల్చారు. హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే అంశంలో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్‌ను ఓపెన్‌గా ఉంచాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఒమన్ దేశాలు హోర్ముజ్‌ను సంయుక్తంగా ఆపరేట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రంప్ ఖండించారు.

