AP&TG

రాష్ట్రంలో 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు-విపత్తుల నిర్వహణ సంస్థ

శ్రీకాకుళం(జి) కొత్తూరులో 45.4°C..

అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొంది.

గురువారం శ్రీకాకుళం(జి) కొత్తూరులో 45.4°C,  కడపలో 45.1°C, మన్యం(జి) సాలూరులో 45.1°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో  44.9°C, విజయనగరం(జి) రాజాంలో 44.5°C,  కాకినాడ(జి) కరపలో 44.4°C, మార్కాపురం(జి) కంభంలో 44°C,  అనకాపల్లి(జి) దేవరపల్లె, కృష్ణా(జి) పెద్దపారుపూడి, నెల్లూరు(జి) సైదాపురంలో 43.5°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 43.3°C, కర్నూలు(జి) నగరడోనలో 43.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె, ఏలూరు(జి) కుక్కునూరు, పల్నాడు(జి) వెల్దుర్తిలో 43.1°C,  పోలవరం(జి) కూనవరం, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *