ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి,పదవీకి రాజీనామా
ఏ.పీ ఫైబర్ నెట్ లో జరిగిన ఆసలు కథ…
అమరావతి: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేశారు..ఇటీవల ఫైబర్ నెట్ లో జరిగిన,, జరుగుతున్న అవినితిపై ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..ఈవివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది..ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు,, జీఎస్టీ చెల్లింపుల వంటి అవకతవకలపై 3 రోజుల క్రిందట అధికారులపై జీవీ రెడ్డి తీవ్రంగా స్పందించారు..వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి చెప్పారు.. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు..అధికారులతో కలిసి పని చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..అవినితికి పాల్పపడిన అధికారులపై తను స్పష్టంమైన ఆధారలతో ఆరోపణలు చేసిన,,అదే అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.
ఏ.పీ ఫైబర్ నెట్ లో జరిగిన ఆసలు కథ… ((విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జివీ.రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా సంస్థ ఉంది అంటే అది ఒక్క ఏపీ ఫైబర్ లిమిటెడ్ మాత్రమే అన్నారు.. అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక కనెక్షన్ ఇవ్వలేదు.. అంతేకాదు ఉన్న కనెక్షన్లు కూడా ప్రచారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాను,, దీనిపై కేబుల్ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయన్నారు.. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటారు.. ఏపీ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ హోదాలో జివీ.రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు..
ఐఏఎస్ అధికారి,, ఏపీ ఎస్.ఎఫ్.ఎల్. ఎం.డి దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.. ఎం.డి మరో ముగ్గురు అధికారులు అయిన భరద్వాజ (చీఫ్ టెక్నాలజీ) సురేష్ (బిజినెస్ హెడ్) శశాంక (ప్రోక్యూర్ మెంట్) ఆఫీసర్ లు కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెర తీశారని ఆరోపించారు.. ఏపీ ఫైబర్ లిమిటెడ్ సంస్థను చంపేసేందుకు కుట్రలకు తెరతీసి,,రాజద్రోహంకు పాల్పపడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.. తక్షణమే భరద్వాజ,,సురేష్,,శశాంకలను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు..
ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగుల అక్రమ నియామకాలు రద్దు చేస్తే,, వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు ఇస్తున్నారని చెప్పారు..అధికారుల అలసత్వం కారణంగా జిఎస్టి అధికారులు రూ. 370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు.. ఈ మొత్తాన్ని పెనాల్టీకి కారణమైన ఎండి దినేష్ కుమార్,,ఈ.డి హెచ్.ఆర్ రమేష్ నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు.. విజిలెన్స్ కమిటీకి రూ.60 కోట్లు చెల్లింపులు నిలిపివేయాలని చెప్పిన,,అధికారులు నగదును చెల్లించే చేశారని తెలిపారు.. ఈ డబ్బును కూడా వారి నుంచి రికవరీ చేస్తామన్నారు..దినేష్ కుమార్,, రమేష్ నాయుడు పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్ కు ఫిర్యాదు చేస్తానని,, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని మీడియా సమావేశంలో జివీ రెడ్డి తెలిపారు..ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీ ఫైబర్ నెట్ ప్రసారాలు బాగున్నాయి అని అన్నారు..తాను అధికారులపై ఆరోపణలు చేస్తున్నాను అని,,ఆరోపణలకు వైసిపి పార్టీకి సంబంధం లేదన్నారు)).