లోకసభలో మళ్లీ వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లు
అమరావతి: మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై తొలుత లోక్సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఈ రెండు బిల్లులు పాస్ కాలేదు. మొత్తం 489 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. బిల్లు పాస్ కావాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 అంటే 326 ఓట్లు కావాల్సి ఉండగా బిల్లుకు అనుకూలంగా 278 మాత్రమే ఓట్లు రావడంతో మహిళ బిల్లుకు అగిపొయింది.
లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది మద్దతు కావాలి. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే నేడు 278 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో కూడా 15 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు విపక్షాల బలం 233. వీరు కాకుండా స్వతంత్రులు, తటస్థ పార్టీలకు చెందిన వారు కలిసి 15 మంది ఉన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే బిల్లు గట్టెక్కేందుకు అవకాశం లభించి ఉండేది. అధికార ఎన్డీఏ కూటమి నుంచి 14 మంది గైర్హాజరయ్యారు. వచ్చిన వారిలో కూడా 15 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాహుల్ గాంధీ లోకసభలో ప్రసంగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోను బిల్లును అమెదించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులకు బ్రేక్ పడింది. ఈ బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

