జిల్లాకు 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరు-కలెక్టరు హిమాన్షు
నెల్లూరు: జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరు వారి చాంబర్‌లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల ద్వారా గేదేలు, మేకలు, గొర్రెలు తదితర పశువులకు, కోళ్లకు సంబంధించి 25 నుంచి 50 శాతం రాయితీపై మందులను అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో నెల్లూరుసిటీ, ఉదయగిరి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేటలోని పశు వైద్యశాలల్లో ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో పశు సంవర్థకశాఖ జాయింట్‌డైరెక్టర్ రమేష్‌నాయక్, ఎడి మాధవీలత, డిసివో గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

