సాక్షి టీవీ చానల్ న్యూస్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
( సాక్షి ఛానల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాత్రికేయుడు కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు..అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు..ఈ వ్యాఖ్యలను ఖండించకుండా, కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. )
హైదరాబాద్: సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను,హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకుని వస్తూన్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు..

