మారనున్న వాతావరణం-దక్షిణ భారతదేశంలో…
అమరావతి: దేశవ్యాప్తంగా వాతావరణం మారే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం విడుదల చేసిన సమాచారం మేరకు వచ్చే వారం మొత్తం వర్షాలు కురవనున్నాయి..ఈశాన్య భారతదేశంలో ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని,,జూన్ 11 నుంచి 14 వరకూ అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు..అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ప్రాంతాల్లో జూన్ 10 నుంచి 13 వరకూ వర్షాలు,,త్రిపురలో ప్రత్యేకంగా జూన్ 8 నుంచి 12 మధ్య తీవ్రగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది..
దక్షిణ భారతదేశంలో:- కేరళ, మహే, తీర ప్రాంతాలైన కర్ణాటక, లక్షద్వీప్ లలో ఈ వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..జూన్ 13, 14న కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది..జూన్ 12న కర్ణాటకలో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.