హనీమూన్ పేరుతో భర్తను హత్య చేయించిన భార్య సోనమ్
అమరావతి: హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసు మిస్టరీ వీడింది..భర్త రాజ రఘువంశీని భార్య సోనమ్,, కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించినట్లు గుర్తించిన పోలీసులు ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బంగారు వ్యాపార కుటుంబానికి చెందిన రాజ రఘువంశీ(30),, సోనమ్(25)కు మే 11వ తేదిన పెళ్లి జరిగింది.. కొత్త జంట హనీమూన్ కోసం మే 20వ తేదిన మేఘాలయ వెళ్లారు..మే 23వ తేదిన తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు..దింతో మేఘాలయ పోలీసులు,, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించగా,, రాజ రఘువంశీ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..అప్పటి నుంచి ఆయన భార్య సోనమ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు..
ఈ నేపధ్యంలో సోనమ్ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పోలీసు స్టేషన్ కు రావడంతో ఆమెను అరెస్టు చేసినట్లు మేఘాలయ డీజీపీ సోమవారం వెల్లడించారు..ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.. రాజ రఘువంశీని చంపేందుకు సోనమ్ తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు జంటలు ఇలా అదృశ్యమయ్యాయి..
గువహటి మీదుగా షిల్లాంగ్:- హనీమూన్ కోసం మే 20న తమ ఇంటి నుంచి బయల్దేరిన కొత్త జంట అసోం రాజధాని గువహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు..షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు..ఈ జంట గువహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణించి, దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) సందర్శించడానికి యాక్టివాను స్కూటర్ ను అద్దెకు తీసుకుని,,దట్టమైన అడవిలోకి వెళ్లారు..మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో ఈ జంట తీసుకుని వెళ్లిన యాక్టివా స్కూటర్ పడి ఉంది కానీ ఈ జంట కనిపించకుండా పోయారు.. రాజా, సోనమ్ అదృశ్యంపై అతని తల్లి రీనా స్పందిస్తూ,,తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు..ఇక అప్పటి నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని తెలిపారు..మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి వుండడంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. పోలీసులు, బంధువులు కలిసి సోహ్రా ప్రాంతంలో గాలింపు చేపట్టారు.. అదృశ్యమైన 11 రోజుల తరువాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు..అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా కేసు నమోద చేసి దర్యప్తు చేస్తున్నారు.
(సోనమ్ తండ్రి దేవి సింగ్ మాట్లాడుతూ తన కుమార్తెను సమర్థిస్తూ “ఆమె నిర్దోషి,,ఆమె ఇలా చేయలేదు” అని అన్నారు.… ఏ ఉద్దేశంతో సోనమ్ తన భర్తను కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి హత్య చేయించింది అనే విషయం ఫోలీసుల దర్యాప్తు వెల్లడి కావల్సివుంది.)
(పోలీసుల కథనం:- రాజా రఘువంశీ మర్డర్‌కు వివాహేతర సంబంధమే కారణమని మేఘాలయా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు..బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుశ్వాతో కలిసి భర్త హత్యకు ఆమె ప్లాన్ చేసి వుంటారని,,అయితే కేసు వత్తిడి వల్ల జూన్ 8వ తేదీన వాళ్లు సరెండర్ అయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు..
సోదరుడి కథనం:- ఈ కేసులో సోనమ్ భాయ్‌ఫ్రెండ్ రాజ్ కుష్వా గురించి బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ,, సోనమ్ వద్ద రాజ్ పనిచేసేవాడని,, వాళ్లు ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లు అని రఘువంశీ సోదరుడు విపుల్ పేర్కొన్నారు..కానీ రాజ్ కుష్వాను ఎప్పుడూ చూడలేదని,,కేవలం అతని గురించి విన్నట్లు విపుల్ తెలిపాడు.. బహుశా రఘువంశీ మర్డర్ కేసులో సోనమ్ పాత్ర ఉండి ఉంటుందని విపుల్ తెలిపారు.)