శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల చేసిన టీటీడీ
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 2026 సంవత్సర బుక్లెట్ను బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు కలిసి ఆవిష్కరించారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ బుక్లెట్ రూపొందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్,ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

