AP&TG

అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి-మంత్రి నారాయణ

97 పనులు ప్రారంభం– 4 ప్రాజెక్టులు పూర్తి..

అమరావతికి రూ.41,187.70 కోట్ల రుణ సమీకరణ..

30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు..

అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అసెంబ్లీలో వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రావణ్‌కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై మంత్రి మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFC తదితర సంస్థల ద్వారా మొత్తం రూ.41,187.70 కోట్ల రుణం సమకూర్చుకున్నామని తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అమరావతిలో చేపడుతున్న మొత్తం 119 పనులకు సుమారు రూ.66,802 కోట్ల వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 103 పనులకు రూ.58,093 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం దాదాపు 25 శాతం పెరిగిందని మంత్రి వివరించారు.

రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు:- ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సమీకరించిన భూమికి సంబంధించి 98 శాతం మేర రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించడం పూర్తయిందని, ప్రస్తుతం వాటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.2,248.02 కోట్ల మేర కౌలు చెల్లించామని మంత్రి వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *