INTERNATIONALNATIONALOTHERS

జ‌పాన్‌లో జ‌ర‌గ‌బోతున్న ఆసియా గేమ్స్‌ కు భారీ వ‌ర్షాలు ముప్పు

అమరావతి: జ‌పాన్‌లో జ‌ర‌గ‌బోతున్న 2026 ఆసియా గేమ్స్‌ కు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద ముప్పు ఎదురు అవుతుంది. జ‌పాన్‌లోని న‌గోయా ప‌ట్ట‌ణంలో ఆసియా గేమ్స్ 2026 సెప్టెంబ‌ర్ 19 నుంచి అక్టోబ‌ర్ 4 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఆసియా గేమ్స్ జ‌రిగే న‌గోయా ప్రాంతంలో కూడా వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో అథ్లెట్ల‌ను అక్క‌డి నుంచి అత్య‌వ‌స‌రంగా మ‌రో చోటుకు త‌ర‌లించారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తే, ఆసియా గేమ్స్ నిర్వ‌హ‌ణ ప్రశ్నార్థ‌కంగా మారుతుంది. క్రీడాల్లో పాల్గొంనేందుకు వివిధ దేశాల‌కు చెందిన క్రీడాకారులు ఇప్ప‌టికే జ‌పాన్ చేరుకొగా, అనేక దేశాల‌కు చెందిన అథ్లెట్లు జ‌పాన్ చేరుకుంటున్నారు. 36 క్రీడ‌ల‌కు సంబంధించిన 503 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. కొన్ని గేమ్స్‌ కు సంబంధించిన పోటీలు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. వీరిలో 269 మంది పురుషులు, 234 మంది స్త్రీలు ఉన్నారు. ఆసియా క్రీడ‌ల‌కు వేదిక కానున్న న‌గోయా ప‌ట్ట‌ణంలో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మంగ‌ళ‌వారం ఒక్క గంట‌లోనే 104 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. న‌గోయా ప‌ట్ట‌ణంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. స‌బ్ వేలు, బ‌స్సు స‌ర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. న‌గ‌ర‌లో ఉన్న వంద‌లాది మంది అథ్లెట్లు, ఇత‌ర క్రీడాకారుల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్రభుత్వం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది.ఇంకా భారీ వ‌ర‌ద ముప్పు పొంచి ఉంద‌ని స్తానిక అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *