AP&TG

శుక్రవారం మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం మేఘవృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *