AP&TGMOVIESOTHERS

‘మెగాస్టార్’ ‘నా ఏకైక హీరో’- అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు-పవన్ కళ్యాణ్

అమరావతి: అన్నయ్య గురించిన ఆలోచనే ఎప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.ఈ ప్రత్యేకమైన రోజున గతాన్ని నెమరువేసుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చిన కొన్ని జ్ఞాపకాలు… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.తన జ్ఞాపకలు పంచుకున్నారు.

అన్నయ్య తిరిగి ఇంటికి రావడం:- మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అన్నయ్య తన కళాశాల చదువు కోసం నరసాపురానికి వెళ్ళేవాడు. వేసవి సెలవులకు అన్నయ్య తిరిగి ఇంటికి రావడం ఒక పండుగలా ఉండేది. తిరిగి కళాశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం మాకు ఎంతో బాధ, నిరాశ కలిగేవి. అయన లేని లోటును, ఆ శూన్యతను మేమందరం బాగా అనుభవించేవాళ్ళం.అన్నయ్య తిరిగి వచ్చేంత వరకు ఇల్లు అంత ఉల్లాసంగా ఉండేది కాదు.

అన్నయ్యకు పెళ్లయినప్పుడు, మా అందరికీ దూరమైపోతారేమోనని నేను ఆందోళన చెందాను. నా కన్నీళ్లకు కారణం తెలుసుకుని అన్నావదినలు నవ్వుకున్నారు. ఆ తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్లి వాళ్ల దగ్గరే ఉంచుకున్నారు. వారు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను వర్ణించడానికి మాటలు చాలవు. షూటింగ్‌ల సమయంలో ఆయన పడిన కష్టం, కృషి, గాయాలను నేను దగ్గరుండి చూశాను. చెన్నైలో ఉక్కపోత, తేమ వాతావరణంలో 18 గంటల పాటు కఠినమైన పనిచేసి, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవారు. తన ఉదారతతో మా కుటుంబాన్ని, బంధువులను ఎంతగానో సంతోషపెట్టారు. అదే స్ఫూర్తిని తన స్నేహితులకు, నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు, ప్రతి ఒక్కరికీ పంచారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసిన ప్రధాన, కీలక వ్యక్తులలో చిరు ఒకరు’ అని పవన్ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *