NATIONALPOLITICS

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి రేపు ప్రమాణ స్వీకారం

అమరావతి: మమతా బెనర్జసీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ చిత్తూగా ఓడిపోవడంతో బెంగాల్ రాజకీయ అవనికపై కమలం మే 4వ తేదిన వికసిచడం జసరిగిపోయింది. బంగాల్‌లో బీజేపీ మార్కు పాలన సాగించేందుకు రథసారధిగా  సువేందు అధికారిని బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఖారారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సువేందును శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయి సువేందు అధికారిని పేరు ఫైనల్ చేశారు. బీజేపీ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహిళా నేత అగ్నిమిత్ర పాల్‌కు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తొంది. డిప్యూటీ సీఎంగా ఆమె ఎంపికైతే బంగాల్ తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు. రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని ఉత్తర బంగాల్‌కు కేటాయించే అవకాశం ఉంది. సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పేరును ఎంపిక చేసినట్లు సమాచారం. అమిత్ షా ఇప్పటికే అగ్నిమిత్ర పాల్, శంకర్ ఘోష్‌లతో విడివిడిగా సమావేశమైయ్యారు. ముఖ్యమంత్రిగా సువేందు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *