AP&TG

“నషా ముక్త్ భారత్” నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి-ప్రధాని మోదీ

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా నిలవాలి-గవర్నర్ అబ్దుల్ నజీర్..

అమరావతి: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి “నషా ముక్త్ భారత్” నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు.ఆదివారం విజయవాడలో నిర్వహించిన “నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ప్రధాని Narendra Modi దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాల నుంచి పాల్గొన్న కోటి మందికి పైగా యువతను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. యువతను ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గవర్నర్ తెలిపారు.

డ్రగ్స్ వినియోగం ఆరోగ్యం, చదువు, కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. MY Bharat ద్వారా “నషా ముక్త్ యువ వాలంటీర్స్”గా నమోదు చేసుకుని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యువత ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. అనంతరం గవర్నర్ పాల్గొన్న వారితో డ్రగ్స్ రహిత ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ 100 వారాల జాతీయ ప్రచార కార్యక్రమం ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *